ఎన్ని కోట్లు ఇచ్చిన అది మాత్రం ఇవ్వను

Nagarjuna Rejects To Sell Manam Rights

01:13 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Nagarjuna Rejects To Sell Manam Rights

అక్కినేని నాగార్జున మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. తాజాగా మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అదే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న 'ఊపిరి' చిత్రం. ఇందులో నాగార్జున-కార్తీ హీరోలుగా నటిస్తున్నారు. కార్తీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో నాగార్జున మొదటిసారి వీల్‌చైర్‌ కి పరిమితమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే విడుదలై చిత్రం పై ఆసక్తి రేకెత్తేలా చేసింది. ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబంలో మూడు తరాలు వారు కలిసి నటించిన చిత్రం 'మనం'. 2014 లో విడుదలైన ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా కావడం బాధాకరం.

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా అక్కినేని కుటుంబానికి తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థే స్వయంగా సొంత బ్యానర్‌ లో నిర్మించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తే సూపర్‌హిట్‌ అవుతుందని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత నాగార్జున దగ్గరకు వచ్చి 'మనం' రీమేక్‌ రైట్స్‌ని అడిగాడట. అయితే ఇది నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రం కావడంతో ఇదొక తీపి గుర్తుగా ఉంచుకోవాలని అక్కినేని కుటుంబం నిర్ణయం తీసుకుందట. దీనితో నాగ్‌ ఆ నిర్మాతకి మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ రీమేక్‌ రైట్స్‌ని అమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడట. తన తండ్రి పై ప్రేమని నాగ్‌ ఈ విధంగా చూపిస్తున్నారని ఆయన ఆలోచనలోనే తెలుస్తుంది.

మనం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

1/8 Pages

మూడు తరాలు:

మొదటిసారి తెలుగులో మూడు తరాలు వారు కలిసి నటించిన చిత్రం మనం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. 

English summary

Manam movie in which whole Akkineni Nageswara Rao family was acted.Manam Movie was the last film of Legendary Actor Akkineni Nageswara Rao.This film was super hit at the box office And a bollywood producer asked Nagarjuna to sell Manam Remake rights but Nagarjuna rejected that offer by saying that it was a memorable film to him and his family.