నా కుమారుల పెళ్ళి గురించి పబ్లిక్ గా చెబుతా

Nagarjuna Say About His Sons Love Affairs

11:42 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Nagarjuna Say About His Sons Love Affairs

తన కుమారులు నాగచైతన్య, అఖిల్ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవడం సంతోషమే అని నాగార్జున ఇంతకుముందే ప్రకటించగా, ఇప్పుడు తాజాగా వారి పెళ్లిపై నాగ్ మరోసారి స్పందించాడు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ అక్టోబర్ లో నాగచైతన్య-కల్యాణ్ కృష్ణ.. అఖిల్ -విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో చిత్రాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తనకు నిన్నేపెళ్లాడతా చిత్రమంటే చాలా ఇష్టమని, అలాంటి స్క్రిప్ట్ నే కల్యాణ్ కృష్ణ తయారు చేశారని, చైతన్య ఆ చిత్రం చేయడం సంతోషంగా ఉందని పేర్కొంటూ ఇందుకు కల్యాణ్ కృష్ణకు ధన్యవాదాలు చెప్పాడు.

ఇక అక్టోబర్ చివరినాటికి ఓం నమో వెంకటేశాయ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని నాగ్ చెప్పాడు. ఇక సోగ్గాడే-2 బంగార్రాజు చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని నాగార్జున స్పష్టం చేసాడు.

కాగా తన ఇద్దరు కొడుకుల పెళ్లి విషయం గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ పబ్లిక్ గా చెబుతానని ఓ ప్రశ్నకు సమాధానంగా నాగ్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి: ఇక నుంచి 24 గంటలూ 'జీ' సినిమాలు!

ఇవి కూడా చదవండి: డామిట్ మైఖేల్ జాక్సన్ బతికే వున్నాడా! సెల్ఫీతో షాకింగ్ న్యూస్

English summary

Tollywood King Akkineni Nagarjuna was presently acting in a Devotional Movie Named "Om Namo Venkatesaya" and nagarjuna said that this movie was going to release on next year Sankranthi Festival. He said that Naga Chaitanya to act under Kalayan Krishna and Akhil to act under Vikram K Kumar. He said that he was happy for his son's love and he said that he will announce with a press meet.