చేసింది చాలు ఇక ఆపేయ్.. సమంతపై నాగ్ సీరియస్!

Nagarjuna serious on Samantha

03:43 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Nagarjuna serious on Samantha

మొత్తానికి నాగ చైతన్య - సమంత లవ్ ఎఫైర్ పై నడుస్తున్న వరుస కధనాలు, సోషల్ మీడియాలో సమంత చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అభిమానులతో వెటకారంగా కూడా జవాబులిచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఈ యవ్వారం గమనిస్తున్న నాగార్జున సడన్ గా సమంతపై సీరియస్ అయ్యినట్లు ఇప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మొట్టమొదటిసారి అఫీషియల్ గా నాగ్ నోరు విప్పినట్టు దీన్ని బట్టి చెప్పవచ్చు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే.. అక్కినేని వారసుడు నాగచైతన్య, హీరోయిన్ సమంతల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది.

1/3 Pages

అయితే, ఈ విషయం బయటకు పొక్కడానికి, పెళ్లి ఫైనల్ కావడానికి ప్రధాన కారణం సమంత యేనని అంటున్నారు. దాదాపు రెండు, మూడు నెలలుగా మీడియా ముందు, సోషల్ మీడియాలో సమంత తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ, తన ప్రియుడు ఎవరో కాదని, తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి అంటూ హింట్లు ఇవ్వడంతో ఈ హంగామా చివరకు పెళ్లి వరకు వచ్చింది. అయితే, ఈ ప్రేమ, పెళ్లి వ్యవహారంపై నాగచైతన్య తండ్రి హీరో నాగార్జున అంతగా ఆసక్తి కనబరచలేదని, ఎట్టకేలకు ఒప్పుకోక తప్పలేదని ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చని వార్తలు వచ్చాయి.

English summary

Nagarjuna serious on Samantha