నాగ్‌ టాక్‌ జూనియర్‌ షాక్‌

Nagarjuna Shocking Comments on Junior

12:13 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Nagarjuna Shocking Comments on Junior

ఇటీవలే పెద్దహిట్‌ కొట్టిన గ్రీకువీరుడు నాగార్జున. మరో చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈనెల 25వ తారీకున ఊపిరి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే నాగ్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఊపిరి గురించి అందులో పాత్రల గురించి అదే విధంగా తనతోపాటు నటించిన కార్తి గురించి అనేక విషయాలను షేర్‌ చేసుకున్నాడు ఈ మన్మధుడు.

అసలు విషయానికొస్తే ఊపిరి చిత్రంలో కార్తి పోషించిన పాత్రని జూనియర్‌ ఎన్టీఆర్‌ చేయాల్సి ఉంది కాని అతడికి డేట్స్‌ కుదరక చేయలేదు. అప్పట్లో ఈ విషయంపై వచ్చిన వార్తలన్నీ నిజాలు కాదంటూ తేలికగా కొట్టేసాడు నాగ్‌. ఈ సందర్భంగా నాగార్జున జూనియర్‌ ఎన్టీఆర్‌ పై కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేసాడు. 'తెలుగు చిత్ర సీమలో టాప్‌ హీరోలుగా వెలుగుతున్న పవన్‌, మహేష్‌, ప్రభాస్‌ ల కంటే కనీసం 30 సంవత్సరాలు రాకుండానే స్టార్‌డమ్‌ సాధించిన ఒకే ఒక యంగ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ' జూనియర్‌ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

నాగార్జున కొడుకులు చైతన్య, అఖిల్‌ గురించి మాట్లాడుతూ 'మంచి స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకుని నటిస్తేనే స్టార్‌డమ్‌ వస్తుందని ఈ విషయంలో జూనియర్‌ ను ఆదర్శంగా తీసుకోమని, 30 ఏళ్ళ రాకుండానే స్టార్‌డమ్‌ వస్తుందని ఈ విషయంలో జూనియర్‌ ను ఆదర్శంగా తీసుకోమని, 30 ఏళ్ళ రాకుండానే స్టార్‌డమ్‌ అందుకున్న హీరో అని తమపిల్లలకు చెప్తుంటానని నాగ్‌ చెప్పుకొచ్చాడు.

జూనియర్‌, నాగచైతన్యలు కలిసి 'గుండమ్మ కధ' రీమేక్‌ లో నటిస్తే చూడాలని ఉంది అంటూ తన కోరికను చెప్పాడు.

English summary

Here Nagarjuna Shocking Comments on Junior.  Junior ntr got shocked with Nagarjun comments.