నాగ్ కి నిద్ర లేకుండా చేస్తున్న సినిమా ఏమిటో తెలుసా?

Nagarjuna spending sleepless nights for Pretham movie

11:22 AM ON 1st November, 2016 By Mirchi Vilas

Nagarjuna spending sleepless nights for Pretham movie

కొడుకు నాగచైతన్య తాజా మూవీ ప్రేమమ్ ఇచ్చిన విజయంతో ఖుషీగా వున్న నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్రరావు డైరెక్షన్ లో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' చేస్తున్నాడు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ మూవీ తరువాత పివిపి ప్రొడ్యూస్ చేయబోయే మూవీ చేయబోతున్నాడు నాగ్. ఇది మళయాళంలో హిట్ 'ప్రేతమ్' మూవీకి రీమేక్ అని టాక్. ఈ మూవీలో నాగార్జునతో పాటు మరో ముగ్గురు యంగ్ హీరోలు కూడా వుంటారట. రీసెంట్ గా నాగార్జున తన మేనల్లుడు సుమంత్ మూవీ 'నరుడా డొనరుడా' ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో తనని ఓ స్టోరీ నిద్ర లేకుండా చేస్తుందని చెప్పాడు.

అది 'ప్రేతమ్' గురించేనని ఊహాగానాలు మొదలయ్యాయి. రాజుగారి గది డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీలో నాగార్జునతో పాటు నాగ శౌర్య, రాజ్ తరుణ్ కూడా నటించిబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి అంతగా నాగ్ కి నిద్ర లేకుండా చేసిన ఆ మూవీ, ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో మరి.

English summary

Nagarjuna spending sleepless nights for Pretham movie