వెంకీ వద్దంటే నాగ్ ఒకే ఎందుకు చెప్పినట్టు !

Nagarjuna To Work With Director Chandra Sekhar Yeleti

10:48 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Nagarjuna To Work With Director Chandra Sekhar Yeleti

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, గోపాల గోపాల సినిమాలతో విభిన్న పాత్రలు ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ అనుకున్న స్థాయిలో తన ఇమేజ్ ను పెంచుకోలేకపోయాడు. దీంతో అలాంటి ఒక విభిన్న కథతో తన దగ్గరకు వచ్చిన ఒక దర్శకుడికి వెంకీ నో చెప్పేశాడట. అయితే, అదే దర్శకుడితో ఓ సినిమా చేయడానికి నాగ్ ఒకే చెప్పేశాడట. ఆ దర్శకుడు ఎవరని అనుకుంటున్నారా, ఇంకెవరు చంద్రశేఖర్ యేలేటి. వాస్తవానికి మనమంతా కథను యేలేటి ముందుగా వెంకీకే వినిపించాడట. అయితే, ఒకే జోనర్ లో సినిమాలు చేస్తున్నానన్న భావనతో వెంకీ ఆ కథను తిరస్కరించాడని టాలీవుడ్ టాక్.

ఇక ఇప్పుడు ఆ సినిమా హిట్టై పోవడంతో పాటు మనమంతా హిట్ తర్వాత యేలేటి వినిపించిన కథకు నాగ్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. నాగార్జున సైతం ఊపిరి, మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ కోవలోనే యేలేటి కథకు నాగ్ ఓకే చెప్పినట్లు టాక్. అయితే, వెంకీ వద్దన్న దర్శకుడికి ఓకే చెప్పి వెంకీని నాగ్ ఆలోచనలో పడేసినట్లు టాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, తాను వద్దన్న దర్శకుడికి నాగ్ అవకాశం ఇవ్వడం వెనుక కారణాలేంటో తెలుసుకునే పనిలో వెంకీ ఉన్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Director Chandra Sekhar Yeleti was known for his different types of movies and recent hit movie Manamanta movie story was first said to Venkatesh but he rejected that movie and now Akkineni Nagarjuna signed a movie with Director Chandra Sekhar Yeleti.