హీరోగా రిటైర్‌ అవ్వనున్న నాగ్‌!!

Nagarjuna want to retire as a Hero

12:21 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Nagarjuna want to retire as a Hero

యువ సామ్రాట్‌ అక్కినేని నాగార్జున 'విక్రమ్‌' సినిమాతో సినీపరిశ్రమకు పరిచయమయ్యాడు. అయితే రొటీన్‌ సినిమాలతోనే కాకుండా భక్తిరస చిత్రాలలో కూడా నటించి భారీ హిట్‌లు సాధించాడు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ ద్వారా ప్రేక్షకులను మొప్పించడంతో తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. అయితే నాగ్‌ హీరోగా రిటైర్‌ అవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెర పై కూడా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షో ద్వారా నాగ్‌ అదరగొడుతున్నాడు. ఇకముందు తండ్రి పాత్రలకే నాగ్ ఫిక్స్ అవ్వాలనే ఆలోచన చేస్తున్నాడని తెలుస్తోంది. నాగ్‌ హీరో పాత్రలకి గుడ్‌బై చెప్పి తన వారసులు అఖిల్‌, చైతూ ల కెరీర్‌ పై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు.

చైతూ సినిమాలు ఎక్కువే ఉన్నాయి కానీ హిట్‌ సాధించిన సినిమాలు తక్కువ. అఖిల్‌ విషయానికొస్తే తన మొదటి సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. వీళ్ళిద్దరినీ తెలుగులో టాప్‌ హీరోలు చెయ్యాలనే నాగ్ ఆలోచిస్తున్నాడు. నాగ్‌ హీరోగా బిజీ అయితే వీరిద్దరి పైనా దృష్టి పెట్టలేడు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాడట. రాఘవేంద్రరావు డైరెక్షన్‌ లో తీసే సినిమా పూర్తయిన తరువాత నాగ్‌ రిటైర్‌ అవ్వనున్నాడని సమాచారం.

English summary

Nagarjuna want to retire as a Hero. He want to put interest on his Son's carriers.