కలాం దగ్గరికి సైకిల్ పై వెళ్లి.. కలిసి భోజనం చేసాడు!

Nagur went to President Bhavan on cycle

01:16 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Nagur went to President Bhavan on cycle

కలలు కనండి... వాటిని సాకారం చేసుకోవడానికి శ్రమించండి అని చెప్తూ అనేకమందిని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రేరేపించారు. ఆయన ఎందరికో స్ఫూర్తినిచ్చిన మిసైల్ మ్యాన్. అలాంటి మహోన్నతుడిని కనీసం చూడాలని ఎస్ నాగూర్ మెరాన్ కలలుగన్నాడు. ఇంతకీ నాగూర్ మెరాన్ ఎవరంటే, పగటిపూట బట్టలు కుడుతూ, రాత్రి వేళల్లో వాచ్ మన్ గా పని చేస్తాడు. తిరువన్మయిపూర్ లో ఓ చెట్టు క్రింద పూరిపాకలో బట్టలు కుట్టే మిషన్, దాని పక్కనే అబ్దుల్ కలాంతో నాగూర్ కలిసి కూర్చున్న ఫొటో కనిపిస్తాయి. కలాం రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో నాగూర్ ఆయన్ని కలుసుకున్నారు.

నేను చచ్చిపోయి, కలాం జీవించి ఉండవలసింది అని ఆ విశేషాలను నాగూర్ గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ లో అబ్దుల్ కలాంను కలుసుకున్నప్పటి సంగతులను నాగూర్ వివరించారు.

1/6 Pages

1. స్నేహితుని సలహా మేరకు సైకిల్ పై..


నాగూర్ కు స్నేహితుడైన లయన్స్ క్లబ్ సభ్యుడొకరు, అబ్దుల్ కలాం దృష్టిలో పడటం కోసం సైకిల్ నే ఉపయోగించాలని సలహా ఇచ్చారు. దీంతో 2003లో తమిళనాడులోని టెంకాసి నుంచి నాగూర్ సైకిల్ పై బయల్దేరారు. చెన్నై, హైదరాబాద్, నాగపూర్, భోపాల్, ఆగ్రా మార్గంలో న్యూఢిల్లీ చేరారు. 35 రోజుల్లో 2700 కి.మీ. ప్రయాణించి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. ఇంత దూరం ప్రయాణించినా, కనీసం ఒక్కసారైనా సైకిల్ టైర్లు పంక్చర్ కాలేదట.

English summary

Nagur went to President Bhavan on cycle