'నల్ల తుమ్మ చెట్టు కాడ’

Naidorintikada Song Making From Brahmotsavam

10:08 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Naidorintikada Song Making From Brahmotsavam

‘నాయుడోళ్లింటికాడ నల్ల తుమ్మ చెట్టు కాడ.. నాయుడేమన్నాడే పిల్లా.. అంటే... నాయుడోళ్లింటికాడ నల్ల తుమ్మ చెట్టు కాడ.. నాటు కోళ్లు ఇచ్చేడే నాయుడు.. అబ్బ గుండె జల్లు మన్నాదే పిన్ని..’’ ఇప్పుడు ఈ పాట తెలుగు వారున్న అన్ని చోట్ల హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది. జనపదాలతో తెలుగుదనం ఉట్టిపడేలా సాగే ఈ పాట మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం లో ప్రత్యేకంగా చిత్రీకరించారు. కాజల్‌, సమంత, ప్రణీత కథానాయికలు గా నటించిన ఈ చిత్రంలోని పాటల మేకింగ్‌లను విడుదల చేస్తూ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న చిత్ర బృందం తాజాగా మరో పాటను విడుదల చేసింది. ‘నాయుడోళ్లింటికాడ.. అంటూ జానపద పదాలతో ప్రారంభమయ్యే ఈ పాటను గాయని రమ్య బెహరా, అంజనా సౌమ్య ఆలపించారు.ఈ సందర్భంగా నటీమణులు జయసుధ, ప్రణీత, కాజల్‌, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌లు ఈ పాట మేకింగ్‌ విశేషాలను వివరించారు. ఈ పాట అభిమానులను ఎంతగానో అలరిస్తుందని వారు పేర్కొన్నారు. మీరు చూసెయ్యండి మరి .

ఇవి కూడా చదవండి:24 ట్రిమ్మింగ్.. దర్శకుడుకి నచ్చలేదా?

ఇవి కూడా చదవండి:ఆ ప్రశ్నతో సమంతకు దిమ్మ తిరిగింది

ఇవి కూడా చదవండి:8 వేల గులాబీలతో హీరోయిన్ ని పడేసిన ఫ్యాన్

English summary

Tollywood Super Star Mahesh Babu was recently acted in a film called "Brahmotsavam" and the movie was released a making video song from the movie. Brahmotsavam movie was going to be released on May 20th.