మీ గోర్లు ఏ రంగులో ఉన్నాయి ??

Nails says about your health

12:18 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Nails says about your health

గోరు ని చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చు. మీ గోర్లు మీ ఆరోగ్యానికి ప్రతిరూపాలు. ఒకొక్కరి గోర్లు ఒకో విదంగా ఉంటాయి. ఆకృతిలోనే కాదు రంగులోను డిఫరెంట్ గానే ఉంటాయి. గోర్లు ఒకో సారి ఒక్కో రంగులో ఉంటాయి ఎప్పుడైనా గమనించారా. అంటే దానర్ధం ఆరోగ్య పరిస్థితిని బట్టి గోరు రంగులు మారుతుంది. కొంతమందికి బాగా తెల్లగానూ కొంతమంది కి ఇంకో రంగులోను ఇలా ఎన్నోరకాలుగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన గోర్లు పింకిష్ రంగులో ఉంటాయి మరియు అంతా సమానమైన రంగులో ఉంటుంది, ఒక చోట ఒక రంగులో ఇంకో చోట వేరోక రంగులో ఉండదు. శరీరం లో వచ్చే ఆరోగ్య పరమైన మార్పుల వలన అసాదరణ రంగు కలిగిన గోర్లు సంభవిస్తాయి. కొన్ని ఉదాహరణకి చూద్దాం .

ఏ రంగు ఏమేమి చెప్తుందో తెలుసుందాం:

పసుపు రంగు:

గోర్లు పసుపు రంగు లోకి మారడానికి గల కారణం లింపిడేమా, ఉపిరితిత్తుల వ్యాది లేదా సోరియాసిస్. వీటి కారణంగా ఈ రంగులోకి మారుతాయి. అందువల్ల ఆరోగ్యం మీద శ్రద్ద వహించి ముందుగానే ఇలాంటి సూచనలను గమనించాలి. ఇలా పసుపు రంగులోకి మారింది అని గమనించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. సాద్యమైనంత వరకు ముందు గానే అటువంటి పరిణామాలు సంభవించకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

పచ్చ రంగు:

ఇలా పచ్చ రంగులోకి మారడాన్ని గ్రీన్ సిండ్రోమ్ అంటారు. ఇలా రావడానికి గల కారణం ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ని సూడోమోనాస్ అంటారు.

గోధుమ రంగు:

ఈ రంగు గోర్లు కలవారు ఎక్కువ గా నికోటీన్ వినియోగించడం వల్ల ఇలా సంభవిస్తుంది. నేల్ పాలిష్ ఎక్కువ గా వాడే వారి లో ఇలాంటి గోధుమ రంగు సిండ్రొమ్ కనపడుతుంది. నేల్ పాలిష్ లు ఎక్కువగా వాడే వారు మంచి కంపనీ ప్రొడెక్ట్స్ వాడడం మంచిది. దాని వలన మీ గోర్లు సురక్షితం గా ఉంటాయి.

ఎరుపు రంగు:

గాయాల కారణంగా గోర్లు ఎరుపు లేదా పర్పల్ రంగులోకి మారతాయి. కొంత మంది కి గోర్ల మీద ఎర్రని గీతలు ఉంటాయి. గోరు కింది భాగం లో రక్త స్రావం సంభవించడం వలన ఇలా ఎర్రని చారలు ఏర్పడతాయి.

నీలం రంగు:

ఇది ఎక్కువగా మందులు వాడే వారిలో కనపడుతుంది. యాంటీ బయాటిక్స్ ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సిండ్రొమ్ కనపడుతుంది.

నలుపు రంగు:

తీవ్ర సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ లేదా సాధారణ గాయాల కారణం గా ఈ నలుపు రంగు గోర్లు సంభవిస్తాయి. కాని మెలనోమా వలన కూడా జరిగే అవకాశం ఉంది. ఇలా సంభవించిన వారు చర్మవ్యాధి నిపుణులను కలవడం మంచిది. దాని వలన వారు తగు పరిష్కార మార్గాలు చూపిస్తారు.

తెలుపు రంగు:

తెల్లని గోర్లు వంశపారంపర్యం గా వస్తాయి లేదా ప్రోటీన్ లోపం వలన రంగు మారడం తో పాటు తెల్లని చారాలు కూడా రావడం జరుగుతుంది. తెల్లని గోర్లు ప్రోటీన్ లోపానికి సంకేతాలు. మీ గోర్లు అలా కనుక ఉంటే శరీరానికి కావలసిన ప్రోటీన్స్ ని పుష్కలం గా అందించండి. అదే విదంగా బొల్లి కారణం గా, పిగ్మెంటేషన్ వల్ల కూడా గోరు తెలుపు రంగు లోకి మారుతుంది.

చూశారు కదా… రంగులు మన ఆరోగ్యం గురించి ఏం చెప్తున్నాయో. ఇక మీదట మీ గోరును తరుచూ గమనిస్తూ ఉండండి.

English summary

Nails says about your health. When something is wrong with your health, one visible clue is nail color.