నానికి బర్త్ డే గిఫ్ట్‌గా హెలికాప్టర్

Naina Wishing Nani Happy Birthday

09:58 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Naina Wishing Nani Happy Birthday

చిన్న హీరో అయినా పెద్ద హీరోగా రాణిస్తున్న నాని క్రేజ్ భలే పెరుగుతోంది. భలే భలే మగాడివోయ్ సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న నాని తాజాగా మెహరీన్‌ తో జంటగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’చిత్రం కూడా మంచి టాకే సొంతం చేసుకుంది. దీంతో ఏకంగా హెలికాప్టర్ గిఫ్ట్ గా రాబోతోందట. పెద్ద హీరోలకు లేని ఈ బంపర్ ఆఫర్ నానికి ఏమిటని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. నాని చిత్రంలో చిన్నారి అనే పాత్రలో నటించిన 'నైనా' సినిమాకే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చేతిలో బొమ్మ పెట్టుకుని, ఆ బొమ్మతో అవినాభావ బంధం ఏర్పరచుకున్న ఈ చిన్నారి, చిత్రం షూటింగ్‌ సమయంలో నానితో ప్రేమగా వ్యవహరించడమే కాదు... చిత్రీకరణ పూర్తయ్యాక కూడా నానిని మర్చిపోలేదు. అందుకే ఇటీవల నాని పుట్టినరోజు సందర్భంగా నైనా ఓ ఆడియో సందేశం పంపింది. ‘హ్యాపీ బర్త్‌డే నాని అన్నా... నీకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తా... నీకు సైకిల్‌ కావాలా... హెలికాప్టర్‌ కావాలా... ఇంకా ఏరోప్లేన్‌ కావాలా... ఇంకా ఏం కావాలి గిఫ్ట్‌? హో... ఏరోప్లేనా... కానీ నీకు ఏరోప్లేన్‌ ఇవ్వను. హెలికాప్టర్‌ ఇస్తా.. ప్రామిస్‌... బాయ్‌’ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడింది. ఈ వీడియోను నాని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న నాని, చిన్నారి పెళ్లికూతురు తనకు బర్త్‌డే మెసేజ్‌ పంపిందని, అందరూ దాన్ని వినాలని కోరుతూ పోస్ట్‌ చేసాడు. మరి హెలికాప్టర్ కి నాని ఓనర్ అవుతాడా? చెప్పండి.

English summary

Recently Nani's Krishna Gadi Veera Prema Gadha movie was become super hit at the box office and in that movie a child artist named Naina was attracted all movie lovers.Naina recently sends a video to Nani by wishing him Happy Birthday