నమో వెంకటేశాయ ఫస్ట్ పిక్

Namo Venkatesaya First Look

10:54 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Namo Venkatesaya First Look

ఓ డిఫరెంట్ చిత్రం ఊపిరి, ఆ తర్వాత పూర్తి భిన్నమైన రొమాంటిక్ పిక్చర్ సోగ్గాడే చిన్నినాయన, ఓ దాన్ని మించి మరొకటి హిట్. విభిన్న కధా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగ్ , ఇటీవల కొంతకాలం విరామం తీసుకున్నాడు. ఏకంగా 4నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఇవాళ షూటింగ్ లో పాల్గొన్నాడు. అదికూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో నాగ్ 'ఓమ్ నమో వెంకటేశాయ' భక్తిరస సినిమాలో.. వేంకటేశ్వరస్వామికి అపర భక్తుడైన హథీరామ్ బాబాగా నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

స్పెషల్ గా వేసిన ఆలయం సెట్ లో శనివారం షూటింగ్ స్టార్ట్ చేశాడు. విమలా రామన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లు గా నటిస్తోన్న మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటూ ఫస్ట్ డే షూటింగ్ పిక్ ని నాగ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా, ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఇస్తున్నాడు. గతంలో దర్శ కేంద్రుడు , నాగ్ కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య , శ్రీరామదాసు , శ్రీ షిర్డీ సాయి చిత్రాలు బానే ఆకట్టుకున్నాయి కదా. మరి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే వున్నాయి.

English summary

Hero Akkineni Nagarjuna was in full swing with his last three films hit and now he was doing a movie with Legendary Director Raghavendra Rao and the movie was titled a "Namo Venkatesaya" and the first look of this movie was released by Nagarjuna by his Twitter account.