గ్రామాన్ని దత్తత తీసుకుని కొత్తగా చేసేది ఏం లేదు

Namrata impresses Burripalem Villagers

05:20 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Namrata impresses Burripalem Villagers

గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో లానే నిజ జీవితంలో కుడా  సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణాలోని ఒక గ్రామంతో పాటు తన సొంత ఊరైన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.మహేష్ బాబు భార్య నమ్రత , మహేష్ బాబు సోదరి పద్మావతి లు ఇటీవల మొట్ట మొదటిసారిగా బుర్రిపాలెం గ్రామాన్ని సందర్శించైనా సంగతి తెలిసిందే. గత గురువారం ఉదయం బుర్రిపాలెం చేరుకున్న నమ్రత అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. 

మహేష్ బాబు లాగానే , నమ్రత కూడా పెద్దగా మాట్లాడిన సందర్భాలు చాల తక్కువ. పైగా అందరితోను కలవడం కుడా తక్కువే. వెక్కడో ముంబై నుండి వచ్చిన నమ్రత కు ఇక్కడి పద్దతులు , ఆచారాలు తెలుసో.? లేదో.? అని చెవులు కోరుకున్నారు. ఇలా అనుకుంటూ ఉండగానే గురువారం  బుర్రిపాలెం వెళ్ళిన నమ్రత కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత నమ్రత టూర్ చక చక సాగిపోయింది.

నమ్రత అందరిని కలుపుకుంటూ ముందుకు సాగిపోయింది. నమ్రత మాట తీరులో సైతం తను ఇక్కడి అమ్మాయినే అనే భావన కలిగే లాగా సాగిపోయింది . నమ్రత మాట్లాడుతూ మీ ఊరికి ఏం చెయ్యాలో , ఏం కావాలో కనుకుని రమ్మని మహేష్ బాబు నన్ను ఇక్కడికి పంపించారు , మహేష్ మీ ఊరి అబ్బాయే , ఆయనకి ఇక్కడి అలవాట్లే ఉంటాయి వంటి మాటలతో అక్కడి ప్రజలందరినీ నమ్రత కట్టి పడేసింది.

1/8 Pages

కృష్ణ ఎప్పుడో చేసేసాడు

చెప్పాలంటే మహేష్ బాబు దత్తత తీసుకున్న తన సొంత ఊరైన బుర్రిపాలెం గ్రామానికి మహేష్ బాబు కొత్తగా చేసేది ఏమి లేదు , ఎందుకంటే ఇంతకు ముందే ఆ గ్రామానికి ఏమేం చెయ్యాలో , ఏమేం కావాలో అన్ని మహేష్ బాబు తండ్రి సూపర్ కృష్ణ ఎప్పుడో చేసేసాడు అని బుర్రిపాలెం గ్రామస్తులు చెబుతుంటారు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలలోకి స్థిరపడిన పదేళ్లకు ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయని చెబుతుంటారు.

సూపర్ స్టార్ కృష్ణ తాను సినిమాలతో బిజీ గా ఉన్నాప్పటికీ తానూ పుట్టిన గ్రామం గురించి ఏనాడు మరువ లేదని , కృష్ణ బుర్రిపాలెం అభివృద్దికి ఎంతో తోడ్పడారని అంటుంటారు. కృష్ణ సినిమాలు నిమిత్తం మద్రాస్ లో ఉన్నప్పటికీ బుర్రిపాలెంలో కృష్ణ తల్లి అయిన ఘటమనేని నాగరత్నమ్మ గారు ఆ గ్రామానికి అవసరమైన వాటన్నింటినీ దగ్గర ఉంది మరి పనులు చేయించేవారు. బుర్రిపాలెం లో ఉన్న స్కూల్ దగ్గర నుండి కళ్యాణ మంటపం, కమ్యూనిటి హాలు, వాటర్ ట్యాంక్లు ఇలా అన్ని ఆమె దగ్గర ఉండి మరి కట్టించారట. అందుకే వాటన్నింటి పైనా ఘటమనేని నాగరత్నమ్మ  గారి పేరు ఉంటుంది. సినిమా రంగంలో సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ కుడా తమ గ్రామానికి వచ్చినప్పుడు ఒక సాధారణ వ్యక్తి లాగా రైతులతో కలిసి బయట అరుగుల పై కూర్చొని ముచ్చటించే వాడని చెబుతారు . ఇప్పుడు మహేష్ బాబు కుడా తన తండ్రి బాటలోనే నడుస్తుండడం , నమ్రత తమ గ్రామం పై తీసుకుంటున్న శ్రద్ద , అందరిని కలుపుకుపోతున్న తీరు చూస్తే అచ్చం నాగరత్నమ్మ లాగే శ్రద్ద తీసుకున్నట్లు ఉందని గ్రామస్తులు అనుకుంటున్నారు.

English summary

We all know Super Star Prince Mahesh Babu was adopted a Village Named Burripalem in Guntur District and recently Mahesh Babu Wife Namrata went to that village and know the problems and needs in the village. She talked very well with the people over there and she impressed the Burripalem Villagers also.