శ్రీవారికి తలనీలాలు సమర్పించిన మహేష్ భార్య

Namrata Shirodkar offers her hair to Lord Venkateswara

10:57 AM ON 22nd September, 2016 By Mirchi Vilas

Namrata Shirodkar offers her hair to Lord Venkateswara

ఎవరైనా సరే దేవునికి మొక్కు మొక్కుకుంటే అది తీర్చాల్సిందే. మొక్కు తీర్చుకునే వరకూ ఓ పట్టాన మనసు కుదుట పడదు. మొక్కు తీర్చుకున్నాక హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటారు. ఇంతకీ విషయం ఏమంటే, టాలీవుడ్ ఫిల్మ్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి తన మొక్కు తీర్చుకున్నారు. బుధవారం ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలసి ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. టిటిడి అధికారులు నమ్రత ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికారు. స్వామివారికి నమ్రత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి దర్శనం తర్వాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలనను అందజేశారు. నమ్రతను గమనించిన మహేష్ అభిమానులు నమ్రతతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఫోటోలు దిగేందుకు నమ్రత ఇబ్బంది పడ్డారు. చున్నీతో తలను కవర్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చదవండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చదవండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

English summary

Namrata Shirodkar offers her hair to Lord Venkateswara. Tollywood Super Star Mahesh Babu's wife Namrata Shirodkar went with her their children to Tirumala and offers her offer to Lord Venky.