సూపర్ స్టార్ సినిమాలో నమ్రత గెస్ట్ రోల్?

Namrata Shirodkar playing guest role in Mahesh Babu movie

11:13 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Namrata Shirodkar playing guest role in Mahesh Babu movie

ఈమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీ డిజాస్టర్ అవ్వడంతో ప్రేక్షకులనందరినీ నిరాశ పరిచాడు. నెక్ట్స్ మూవీ కోసం ఫాన్స్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. అందుకే ప్రిన్స్ సినిమా అనగానే మహేష్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులందరికి ఓ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చేయబోయే తన కొత్త సినిమా క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ తో కాబట్టి ఈసారి అభిమానులు హాయిగా రిలాక్స్ కావచ్చు. ప్రెజెంట్ జనరేషన్ డైరెక్టర్లలో మురుగదాస్ కు ఉన్న సక్సెస్ పర్సెంటేజ్ మరో డైరెక్టర్ కు లేదు. మహేష్-మురుగుదాస్ కాంబినేషన్ లో సినిమా మొదలువుతుందని తెలిసినప్పటి నుంచి మీడియాలో పలు రకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఓసారి హీరోయిన్ గురించి, మరోసారి బడ్జెట్ గురించి.. ఇలా ఇప్పటికే వందల గాసిప్స్ మీడియాలో వచ్చాయి. ఇటువంటి గాసిప్స్ లో లేటెస్ట్ గాసిప్ మహేష్ వైఫ్ నమ్రత ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో తళుక్కున మెరవనుందట. మహేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత నటనకు గుడ్ బై చెప్పింది. ఇన్నేళ్ళలో మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. దీంతో ఒక స్పెషల్ పాత్రలో నటించవలసిందిగా నమ్రతను మురుగదాస్ కోరాడట. నమ్రత కూడా అలోచించి చెప్తానని అందట. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మహేష్ అభిమానులకు గుడ్ న్యూసే కదా. మరోసారి మహేష్ దంపతులను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం మురుగుదాస్ ద్వారా వస్తే ఫాన్స్ కి ఇక పండగే పండగ అని చెప్పవచ్చు.

English summary

Namrata Shirodkar playing guest role in Mahesh Babu movie