టీ మంత్రితో ప్రిన్స్ భార్య మంతనాలు

Namrata Shirodkar with Telangana minister

04:43 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Namrata Shirodkar with Telangana minister

ఇదేమి రాజకీయం అనుకుంటున్నారా? రాజకీయం కాదు గ్రామ దత్తత వ్యవహారం... అందుకే ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయింది. సచివాలయంలో మంత్రిని కలిసిన ఆమె, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామ అభివృద్ధి పై మంతనాలు సాగించింది. సిద్ధాపూర్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నమ్రతకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నమ్రత మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధాపూర్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు, ఆధునికమైన, ఆకర్షణీయమైన గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.

కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమ్రత సిద్ధాపూర్ గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో మెడికల్ క్యాంపును ప్రారంభించి గ్రామస్తులతో సమావేశమై పలు సమస్యల పై చర్చించిన సంగతి తెలిసిందే.

English summary

Namrata Shirodkar with Telangana minister