ఈసారి మహేష్ తో కల్సి వస్తానన్న నమ్రత

Namrata Visits Burripalem Village

04:50 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Namrata Visits Burripalem Village

శ్రీమంతుడు సినిమాలో చేయడమే కాదు నిజజీవితంలో కూడా స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమంలో భాగంగా సొంత గ్రామాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్నాడు. ఇక కార్యాచరణ కోసం రంగం సిద్ధం చేసుకున్నాడు. ఓ పక్క షూటింగ్ లో బిజీగా వుండడం వలన ఆ ఊరు వెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ మహేష్‌ కుటుంబ సభ్యులు గురువారం పర్యటించారు. సినీనటి, మహేష్‌బాబు సతీమణి నమ్రత, సోదరి పద్మావతి తొలిసారిగా ఆ ఊరు సందర్శించారు. సూపర్‌స్టార్‌ కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెం గ్రామం వెళ్లి, కృష్ణ ఇంటికి ఉదయమే నమ్రత చేరుకున్నారు. ఇక అక్కడనుంచి చకచకా టూర్ సాగింది. అనంతరం కృష్ణ తల్లిదండ్రులు వీరరాఘవయ్య, నాగరత్నమ్మ ఆర్థిక సహాయంతో నిర్మించిన గీతా మందిరాన్ని సందర్శించారు. అనంతరం ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. సాల్వేషన్‌ ఆర్మీ పాఠశాల వద్ద నమ్రతను స్థానికులు ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఘట్టమనేని నాగరత్నమ్మరాజా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చేరుకుని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికి సమస్యలు వివరించారు. ఏపీకే కల్యాణణమండపంలో నిర్వహించిన గ్రామసభలో స్థానిక సమస్యలు, అవసరాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనం మరమ్మతులు, అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనాలు, గ్రామంలో ఆరోగ్య కేంద్రం, ఇతర మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్థులు కోరారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా బుర్రిపాలేన్ని చూడాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెల్పుతూ, గ్రామంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిఒక్కరూ చదువుకోవాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని, మహిళలు, పెద్దలను గౌరవించాలని సూచించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్న విధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచాలని కోరారు. త్వరలో మహేష్బాబుతో కలిసి తాను గ్రామానికి వస్తానని, ఈలోగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. ఇక శ్రీమంతుడు అడుగు పెట్టడమే తరువాయి.

దత్తత గ్రామ అభివృద్ధికి 'శ్రీమంతుడు' తొలి అడుగు

అసదుద్దీన్‌ నాలుక తెగ్గోస్తే రూ.21 వేల బహుమతి ఇస్తా..

భాగ్యనగరిలో రూ 25వేల కోట్లతో డిస్నీ లాండ్

పది కోట్లు ఇవ్వలేదని శవంగా మార్చారు

పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

English summary

Super Star Mahesh Babu Adopted A Village named Burripalem in Guntur District and Mahesh Babu family started the development works at burripalem. Mahesh Babu wife and Veteran Actor Namrata and mahesh babu family members visited that Village and know about the problems and requirements in the village .She said that Mahesh Babu was in busy with the shooting and that's the reason mahesh babu did not came and he will definitely come next time.