స్టార్ హీరోలను కామెంట్ చేసిన నమ్రతా

Namratha Shirodkar blames tollywood star heroes

06:26 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Namratha Shirodkar blames tollywood star heroes

ఎప్పుడూ సినీ పరిశ్రమలో వివాదాలకి దూరంగా ఉండే ఫ్యామిలీ అంటే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ అనే చెప్పాలి. కృష్ణ గారు ఎంత క్రమశిక్షణగా ఉండే వారో, ఆయన వారసుడు మహేష్ బాబు కూడా అంతే క్రమశిక్షణగా ఉంటారు. సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచి మహేష్ ఎప్పుడూ వివాదాలకి దూరం ఉంటారు. ఇదే రీతిలో ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఎప్పుడూ మీడియా కి వివాదాలకి దూరంగా ఉంటుంది. అయితే నమ్రత తాజాగా ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ‘రిట్జ్’ కు ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ టాప్ హీరోలను కామెంట్ చేసినట్లు అనిపిస్తున్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఈ ఇంటర్‌వ్యూ లో నమ్రత తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలతో పాటు తన భర్త మహేష్ గురించి మరియు ఇతర విషయాలు గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. ఆ కొన్ని విషయాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇంటర్‌వ్యూ లో నమ్రత మహేష్ ను ఎక్కువగా పొగడటంతో పాటు మిగతా హీరోలను తక్కువ చేసి మాట్లాడినట్లుగా ఆమె మాట్లాడిన మాటలు అనిపిస్తున్నాయని కొందరి వాదన. నేను మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్ ని, ఆయనకంటే టాలెంటెడ్ మరియు బెస్ట్ హీరో ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? అనే విషయం గురించి నేను పట్టించుకోను అంటూ ఇంటర్‌వ్యూ లో చెప్పింది.

ఇంకా దీనితో పాటు మహేష్ తన కెరియర్ లో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అంతేకాదు మహేష్ విభిన్న పాత్రలలో నటిస్తే చూడాలని ఉంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఇస్తూ నేను మహేష్ బాబు సినిమాలు తప్ప మరే హీరో సినిమా లు చూడనని షాక్ ఇచ్చింది. మహేష్ బాబుకు ఎలాంటి కాంపిటీషన్ లేదు అని అంటూ ఒకవేళ మహేష్ కి ఎవరైన పోటీ వచ్చిన నేను వాళ్ళని పట్టించుకొను అనే విధంగా నమ్రత మాట్లాడింది. ఇంకా వీటితో పాటు నేను మహేష్ ని పెళ్ళి చేసుకునే సరికి మహేష్ కంటే బెటర్ హీరోలు ఉన్నప్పటికీ మహేష్ ఏ బెస్ట్ అని భావించేదాన్ని అని నమ్రత అతి విశ్వాసంతో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నమ్రతా మాటలు వివాదాస్పదంగానే ఉన్నాయి అని కొందరి వాదన.

English summary

Namratha Shirodkar blames tollywood star heroes in English Magazine Ritz interview.