కారు ప్రమాద సమయంలో బాలయ్య ఏం చేసాడంటే

Nandamuri Balakrishna clarification on accident

10:51 AM ON 30th June, 2016 By Mirchi Vilas

Nandamuri Balakrishna clarification on accident

హిందూపురం నుంచి బెంగుళూరు వైపు కారులో వెళుతున్న నందమూరి నటసింహం బాలయ్య కారుకి ప్రమాదం జరిగి బాలయ్య తృటిలో తప్పించుకున్న సంగతి తెల్సిందే. అయితే ప్రమాదం నుంచి కోలుకుని హైద్రాబాద్ చేరుకున్న బాలయ్య వాహన ప్రమాదంపై నందమూరి వివరణ ఇచ్చాడు. తన కారుకి యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ, తనకు ఏమీ కాలేదని అన్నారు. తాను స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను ఢీకొట్టానని, కారు టైరు బ్లాస్ట్ కావడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు. తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా బయటపడ్డానని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇదిలాఉంటే, యాక్సిడెంట్ అయిన సందర్భంలో క్యాష్ ఉన్న సూట్ కేస్ కింద పడ్డంతో బాలయ్య ఆ డబ్బును తీసుకుంటున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.

ఇది కూడా చూడండి: ఐపీఎల్ లో క్రికెటర్ల జీతాలు చూస్తే షాకవ్వల్సిందే

ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: టాలీవుడ్ లో అచ్చం ఒకలాగే ఉండే సెలబ్రిటీస్

English summary

Nandamuri Balakrishna clarification on accident at Karnataka State Bagepalli village. Now he is safe luckly.