సౌఖ్యం ఆడియోలో 'డిక్టేటర్'!!

Nandamuri Balakrishna coming as a chief guest for Soukhyam audio function

12:24 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Nandamuri Balakrishna coming as a chief guest for Soukhyam audio function

లౌక్యం, జిల్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో దూసుకుపోతున్న హీరో గోపిచంద్‌ తాజా చిత్రం 'సౌఖ్యం'. తనకి హీరోగా మొదటి హిట్‌ ఇచ్చిన 'యజ్ఞం' డైరెక్టర్‌ ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం సౌఖ్యం. ఈ చిత్రంలో గోపిచంద్‌ సరసన మొదటి సారి రెజీనా నటిస్తోంది. ఇటీవలే గోపిచంద్‌ - శ్వేతా భరద్వాజ్‌ లపై ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరణతో ఘాటింగ్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.

సౌఖ్యం ఆడియోని డిసెంబర్‌ 13 న ఒంగోలులో అంగరంగ వైభవంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోకి నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ పతాకం పై నిర్మిస్తున్నారు.

English summary

Nandamuri Balakrishna coming as a chief guest for Soukhyam audio function and Regina Cassandra is pairing with Gopichand first time. And the film is directed by A.S. Ravikumar Chowdary.