బాలయ్య ప్రపోజల్... బిగ్ బి ఏమన్నాడు ?(వీడియో)

Nandamuri Balakrishna Met Amitabh Bachchan

11:39 AM ON 20th October, 2016 By Mirchi Vilas

Nandamuri Balakrishna Met Amitabh Bachchan

టాలీవుడ్ లో గానే, బాలీవుడ్ లో గాని ఒక్కోసారి అనుకోని ఘటనలు తారసపడతాయి. అలాంటప్పుడు కొన్ని ప్రతిపాదనలు, ఆఫర్లు వస్తాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ పక్క బాలయ్య బాబు గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ సాగుతోంది. మరోవైపు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ సర్కార్-3 షూటింగ్ లో పాల్గొంటున్నారు. అప్పుడే ఒక అరుదైన సంఘటన జరిగింది. ఆ బాలీవుడ్ స్టార్ ను నందమూరి నటసింహం పలకరించారు. కాసేపు భేటీ అయ్యారు. మాటామంతీ కానిచ్చారు. ముంబై ఫిలిం సిటీలో కనిపించిందా అరుదైన సన్నివేశం. గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ లో ఉన్న బాలయ్య బాబు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పిచ్చాపాటీ మాట్లాడారు. ఈ సందర్భంగా తన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి అమితాబ్ కు బాలయ్య వివరించాడట. అంతటితో వదలిస్తే పర్వాలేదు ఏకంగా కృష్ణవంశీ డైరెక్షన్ లో వస్తున్న తన తదుపరి రైతు చిత్రంలో ఓ పాత్రలో నటించాలని అమితాబ్ ను కోరాడట. తెలుగు సినిమాల్లో నటించేందుకు బిగ్ బీ ఇటీవలి కాలంలో ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, బాలయ్య బాబు ఓ ప్రపోజల్ ను బిగ్ బీ ముందుంచడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి బాలయ్య ప్రతిపాదనకు అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ఇప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే తర్వాతైనా అమితాబ్ నుంచి ఓకే అంటూ సమాధానం వస్తుందా వేచి చూడాలి. ఒకవేళ అమితాబ్ ఒప్పుకొంటే మాత్రం ఓ క్రేజీ కాంబినేషన్ ను తెలుగు తెరపైన చూడొచ్చన్నమాటే. తద్వారా అమితాబ్ తన తొలి తెలుగు సినిమానూ చేసినట్టవుతుంది. ఇంతకీ ఏమౌతుందో వెయిట్ అండ్ సీ.

ఇవి కూడా చదవండి:మా టీవీని బండ బూతులు తిడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్.. ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి:'బాహుబలి'లో నటించడానికి నో చెప్పిన స్టార్ హీరోయిన్!

English summary

Film Actor and Politician MLA Nadamuri Balakrishna Met Bollywood Big B Amitabh Bachchan on Sarkar-3 movie set and asked Amitabh to act in his film with Krishna Vamshi and the movie named as "Raithu". Now this video was going viral over the internet and social media.