బాలయ్య రాజసూయ యాగం ...

Nandamuri Balakrishna Performing Rajasuya Yagnam

10:27 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Nandamuri Balakrishna Performing Rajasuya Yagnam

దేశ ప్రజలు సుఖ శాంతులతో వుండాలని రాజసూయ యాగం చేస్తుంటారు. పూర్వం రాజులు ఈ యాగం చేసేవారు. ఇప్పుడు ఎవరూ చేయడం లేదు. అయితే ఇప్పుడు నందమూరి నటసింహం, హిందూపురం ఎం ఎల్ ఏ బాలకృష్ణ ఈ యాగం చేస్తున్నాడు. ఇంతకీ ఇది రియల్ లైఫ్ లో కాదండి, రీల్ లైఫ్ లోనే ... బాలయ్య ప్రతిష్టాత్మకంగా 100వ చిత్రంగా జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, భూపేష్ భూపతి కళాదర్శకత్వం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాలు, సాయిమాధవ్ బుర్రా మాటలు, రామ్లక్ష్మణ్ ఫైట్స్ సమకూరుస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్లో జరుగుతోంది. బాలకృష్ణ, హేమమాలిని, శ్రియలపై కీలక సన్నివేశాలను తాజాగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 6 నుంచి 'రాజసూయయాగం' చిత్రీకరణ చేపట్టినట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. అఖండ భారతావనిని ఏకతాటిపై తెచ్చేందుకు పాండవాగ్రజుడు ధర్మరాజు, చరిత్రలో శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యాగాలను నిర్వహించారు.

రాజసూయయాగ సమయంలోనే శాతకర్ణి తన తల్లి గౌతమి పేరును తన పేరు ముందు ఉంచుకుని గౌతమిపుత్ర శాతకర్ణిగా తన పేరును ప్రకటించుకున్నారు. ఆ రోజునే కొత్త యుగానికి ఆది ఉగాది అని ప్రకటించారు. నాటి నుంచి అదే రోజున ఉగాది పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. నిజజీవితంలో బాలకృష్ణ తన తల్లిపేరుతో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కు ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

'రాజసూయయాగం' ఘట్టాల చిత్రీకరణ ప్రారంభమైన మంగళవారంనాడే స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం కావడం, మోక్షజ్ఞ పుట్టినరోజు కావడం విశేషం. ఈ నెల 20 వరకు ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్లో నే కొనసాగుతుంది.

ఇది కూడా చూడండి: మీరు చేసే వ్యాపారం బట్టి మీరు ఏ రంగు పర్స్ వాడితే మంచిదో తెలుసా?

ఇది కూడా చూడండి: ఏకైక నరముఖ వినాయక దేవాలయం ప్రపంచంలో ఎక్కడుందో తెలుసా?

English summary

Nandamuri Balakrishna Performing Rajasuya Yagnam.