కేసి ఆర్ ని ఆకాశానికి ఎత్తేసిన బాలయ్య

Nandamuri Balakrishna Praises Telangana CM KCR

11:18 AM ON 20th August, 2016 By Mirchi Vilas

Nandamuri Balakrishna Praises Telangana CM KCR

ఇదేమిటి అనుకుంటున్నారా నిజం తెలంగాణా సీఎం కేసీఆర్ ని బాలయ్య తెగ పొగిడేసాడు. గోదావరి పుష్కరాలతో పోలిస్తే.. కృష్ణా పుష్కరాల సందర్భంగా రద్దీ తక్కువగా ఉండటంతో.. తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దగా దృష్టి పెట్టటం లేదన్న మాట వినిపిస్తోంది. అయితే.. పుష్కర పర్యవేక్షణ బాధ్యతలు మంత్రులకు అప్పజెప్పిన నేపథ్యంలో ఆయన కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారట.

అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పనుల్లో కిందామీదా పడిపోతున్నారు. నిద్రాహారాలు మానేసి ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. ఆయన శ్రమకు తగ్గట్లే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయంటూ ప్రముఖులు కితాబులిస్తున్నారు. ఏపీ పుష్కర ఏర్పాట్లు బాగున్నాయంటూ పలువురు పొగిడేస్తుంటే.. తెలంగాణలో అలాంటి వాతావరణం ఏదీ కానరావడం లేదు. ఈ లోటుని సినీ నటులు.. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భర్తీ చేసేసాడు. మహబూబ్ నగర్ జిల్లా సోమశిల పుష్కరఘాట్వీఐపీ ఘాట్ లో బాలయ్య తో పాటు ఆయన శ్రీమతి వసుంధర, అక్క లోకేశ్వరి.. చిన్నసోదరి ఉమామహేశ్వరి.. ఆమె భర్త శ్రీనివాసప్రసాద్ కలిసి పుష్కర స్నానం చేశారు.

ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు పిండ ప్రధానం చేసిన బాలకృష్ణ కు తెలంగాణ మంత్రి జుపల్లి స్వాగతం పలికి.. ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పుష్కర ఏర్పాట్లు చాలా బాగున్నాయని, తెలంగాణ ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసిందంటూ కితాబునిచ్చారు. పుష్కరాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లపై ప్రముఖులు ఎవరూ కాంప్లిమెంట్లు ఇవ్వలేదని ఫీలవుతున్న పలువురికి బాలయ్య కాంప్లిమెంట్ కేసీఆర్ కి సొంతోషం కలిగిస్తుందని అంటున్నారు. అదేసమయంలో టిడిపి శ్రేణులకు ఇబ్బంది గా బాలయ్య వ్యాఖ్యలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చుడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

ఇది కూడా చుడండి: మీ శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు ఇవే

ఇది కూడా చుడండి: లేడీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలు ఇవే

English summary

Nandamuri Balakrishna Praises Telangana CM KCR over Krishna Pushkaralu.