నందమూరి అన్నదమ్ముల వరద సాయం

Nandamuri brothers Ntr and Kalyan Ram donated 15 lakhs to Chennai victims

06:31 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Nandamuri brothers Ntr and Kalyan Ram donated 15 lakhs to Chennai victims

20 రోజులు నుండి చెన్నై లో భారీ వర్షాలు కురుస్తున్నాయన్న విషయం తెలిసిందే. నవ్యాంద్రప్రదేశ్‌ అయిన నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని లోతట్టు ప్రాంతాల్లో, ఎయిర్‌పోర్ట్‌ మరియు ఇతర ప్రాంతాల్లో జలమయం అయ్యాయి. ఇప్పటికే తమిళ హీరోలు, ఇతర రాష్ట్రాల వారు వరద భాదితులకి వాళ్లకి తోచిన సాయం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోతున్నా, మన తెలుగు హీరోలు, రాజకీయవేత్తలు ఇంకా కాలు కదపడంలేదు. తెలుగు ఇండస్ట్రీ నుండి ఇటీవలే సంపూర్ణేష్‌ బాబు 50 వేలు విరాళం ఇవ్వగా తాజాగా నందమూరి ముద్దుబిడ్డలు ఈ నష్టం పై స్పందించారు.

ప్రకృతి ఇలా విరుచుకుపడి మన దేశ సమగ్రతను పాడు చేస్తుంది మనమంతా కలిసికట్టి వారికి సహాయం చెయ్యాలి అని నా వంతు సహాయంగా 10 లక్షలు విరాళంగా ఇస్తున్నాని ఎన్టీఆర్‌ అన్నారు. తమ్ముడి బాటలోనే నందమూరి కళ్యాణ్‌రామ్‌ ముందుకొచ్చి 5 లక్షల విరాళాన్ని చెన్నై సహాయ నిధికి అందించారు. వీరితో పాటు టాలీవుడ్‌ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రయుఖులు కూడా ఈ విషయం పై స్పందించాలని ఆశిద్దాం.

English summary

Nandamuri brothers Ntr and Kalyan Ram donated 15 lakhs to Chennai victims to CM relief fund.