మోక్షజ్న వాయిస్ బయటకు వచ్చేసింది....

Nandamuri Mokshagna interview with India Today

12:57 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Nandamuri Mokshagna interview with India Today

నందమూరి అభిమానుల్లో గడిచిన రెండు మూడేళ్లుగా నోళ్లల్లో నానుతూనే ఉన్న పేరు నందమూరి మోక్షజ్న. నటసింహం బాలయ్య వారసత్వాన్ని అందుకుని ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని అభిమానులు ఈ కుర్రాడి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారం వచ్చే సంవత్సరమే సినిమాల్లోకి అడుగపెట్టేస్తున్నాడు మోక్షజ్న. అయితే ఇప్పటిదాకా మోక్షజ్న ఎప్పుడూ మీడియాలో కనిపించింది లేదు. అసలు మాట్లాడలేదు కూడా. అయితే బాలయ్య వారసుడిని తొలిసారి మాట్లాడించి, అతడి వాయస్ ను ప్రచురించిన ఘనత ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ దే.

ఇది కూడా చదవండి: 'బాహుబలి' కి జాతీయ అవార్డు.. ఇంకా..

ఈ మ్యాగజైన్.. ఇటీవలే నందమూరి బాలకృష్ణ మీద ఓ ప్రత్యేక ఎడిషన్ తీసుకొచ్చిన నేపధ్యంలో మోక్షజ్ఞకు సంబంధించి కూడా ఓ కాలమ్ ప్రచురించారు. ఈ సందర్భంగా తండ్రి గురించి మోక్షజ్న ఏమన్నాడంటే, తన తండ్రి తనను ఒక స్నేహితుడిలాగా చూస్తాడని చెప్పాడు. తనను చదువుకోమని గానీ.. సినిమాల్లోకి రమ్మని గానీ బాలయ్య ఒత్తిడి చెయ్యలేదని చెప్పాడు. తన కెరీర్ పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తన తండ్రి తనకే వదిలేశారని.. అందుకు ఆయనకు కృతజ్నతలు చెబుతానని మోక్షజ్న అన్నాడు. తాను కచ్చితంగా తన తండ్రి-తాతయ్య నందమూరి తారక రామారావు వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తానని.. అభిమానుల అంచనాలను అందుకుంటానని మోక్షజ్న ధీమాగా చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: 'కబాలి' కొత్త పోస్టర్

English summary

Nandamuri Mokshagna interview with India Today. Nandamuri Balakrishna son Mokshagna gave interview to India Today magazine.