మోహన్ లాల్ సినిమాలో తారక్!

Nandamuri Tarakaratna in Manamantha movie

01:43 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Nandamuri Tarakaratna in Manamantha movie

ఇదేమిటి ట్విస్ట్ అనుకుంటున్నారా? ఇప్పటికే నందమూరి తారకరామారావు(జూనియర్ ఎన్టీఆర్) తో కలిసి 'జనతా గ్యారేజ్' లో మోహన్ లాల్ నటిస్తుంటే, మళ్ళీ మోహన్ లాల్ సినిమాలో నందమూరి ఏంటి అనే డౌట్ రావడం సహజం. కానీ 'మనమంతా' మూవీ గురించి ఇప్పుడు కొత్త విషయం రివీల్ అయ్యింది. మోహన్ లాల్-గౌతమి ముఖ్యమైన రోల్స్ చేస్తున్న ఈ మూవీలో, ఇప్పుడేమో నందమూరి హీరో కీలకపాత్ర చేస్తున్నట్టు టాక్. మూవీ ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని యూనిట్ రివీల్ చేసింది. ఇంతకీ నందమూరి హీరో ఎవరంటే, ఈ మధ్య వచ్చిన రాజా చెయ్యి వేస్తే చిత్రంలో నెగెటీవ్ రోల్ చేసి మంచి మార్కులు కొట్టేసిన తారకరత్న.

ఇప్పుడు మనమంతాలో నటించడానికి ఒకే చెప్పాడట. మరి ఈ మూవీలో తారకరత్న ఎలాంటి రోల్ చేస్తున్నాడు? అనే ప్రశ్న సహజంగానే రైజ్ అవుతోంది. కొద్దిరోజులు కనిపించకుండా గ్లామర్ ఇండస్ర్టీకి దూరమైన తారకరత్న, మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ చేస్తున్న మనమంతా మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈలోగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

English summary

Nandamuri Tarakaratna in Manamantha movie