తిరుపతిలో 'నంది' సందడి 

Nandi Awards Event In Tirupathi

06:47 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Nandi Awards Event In Tirupathi

పదిరోజులపాటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో నంది నాటకోత్సవాలు సందడి చేయనున్నాయి. ఎపి ప్రభుత్వ పక్షాన తిరుపతిలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మహతి కళాక్షేత్రం వేదికగా పదిరోజుల పాటు ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తారు. ఎంపీలు శివప్రసాద్‌, మురళీమోహన్‌, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు , ఎమ్మెల్యేలు సుగుణమ్మ, రోజా తదితరులు హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి సుమారు 2వేల మంది కళాకారులు ఈ నాటకోత్సవంలో ప్రదర్శనలు ఇస్తారు. చివరి రోజున ఎన్టిఆర్ రంగస్థల పురస్కారంతో సత్కారం, ఇతర పురస్కారాలతో సన్మానం, నంది నాటక విజేతలకు బహుమతుల అందజేత వుంటాయి.

English summary

Nandi awards function to be held on tirupathi by Andhra Pradesh Government In Mahathi Kalakshetram in Tirupathi.TDP MP's Murali Mohan , Siva Prasad and MLC Gali Muddu Krishnama Naidu etc to be attend as cheif guests in thIS event