నరేష్ తనయుడు హీరోగా 'నందిని నర్సింగ్ హోమ్' ఆడియో విడుదల

Nandini Nursing Home movie audio release

12:20 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Nandini Nursing Home movie audio release

నరేష్ తనయుడు నవీన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న 'నందిని నర్సింగ్ హోమ్' చిత్రంలో శ్రావ్య, నిత్య కథానాయికలు. గిరి దర్శకత్వం వహించారు. రాధా కిషోర్, భిక్షమయ్య నిర్మాతలు. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్ లో విడుదలయ్యాయి. తొలిసీడీని ప్రిన్స్ మహేష్ బాబు ఆవిష్కరించగా, సూపర్ స్టార్ కృష్ణ అందుకొన్నారు. ట్రైలర్ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ నవీన్ మంచి ఎడిటర్. కొత్తగా ఆలోచించేవాడు. నా సినిమాలకు సంబంధించిన కొన్ని ఫైట్స్ ని ఎడిట్ చేసి ఇచ్చాడు. చాలా ఏళ్లక్రితం హీరో అవుతా అని చెప్పినప్పుడు నమ్మలేదు. ఎందుకంటే అప్పుడు చాలా బొద్దుగా ఉండేవాడు.

కొన్నాళ్లకు సన్నగా మారాడు. సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. అదే తన కష్టానికి నిదర్శనం. కష్టపడితే, తప్పకుండా విజయం దక్కుతుందని నా నమ్మకం. నవీన్ కూడా అలానే కష్టపడతాడు. విజయం అందుకోవడం ఈజీ అని అన్నాడు. అందరి సహకారం వల్లే ఈ సినిమా పూర్తయ్యింది. సాంకేతిక నిపుణులు బాగా కష్టపడ్డారు. నా స్నేహితుడు అచ్చు మంచి బాణీలిచ్చారని నవీన్ అన్నాడు. ఈ కార్యక్రమంలో విజయ నిర్మల, సుధీర్ బాబు, సాయిధరమ్ తేజ్, కోటి, రాజ్ కందుకూరి, కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary

Nandini Nursing Home movie audio release