నాని నటన అద్భుతం: మహేష్‌

Nani acting was awesome: Mahesh Babu

12:33 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Nani acting was awesome: Mahesh Babu

'భలేభలే మగాడివోయ్‌' సినిమా ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించి హీరో నాని కి స్టార్‌ స్టేటస్‌ ను తెచ్చిపెట్టింది. నాని తాజా సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'. ఈ సినిమా ఫిబ్రవరి 5న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ లో శిల్పకళావేదికలో జరిగింది. సూపర్‌స్టార్‌ మహేష్‌ చేతుల మీదుగా ఈ సినిమా ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియో ఫంక్షన్‌ లో మహేష్‌ మాట్లాడుతూ 14 రీల్స్‌ సంస్థతో తనకి చాలా అనుబంధం ఉందని తెలిపారు. మహేష్ హీరో నాని గురించి మాట్లాడుతూ నాని నటించిన భలేభలే మగాడివోయ్‌ సినిమా తనకు చాలా నచ్చిందని అన్నాడు. ఆ సినిమాలో నాని నటన అద్భుతంగా ఉందని ప్రసంసించాడు.

'అందాల రాక్షసి' సినిమా దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమా ద్వారా మొహరీన్ హీరోయిన్‌ గా పరిచయం కాబోతుంది.

English summary

Mahesh Babu told that Nani acting was excellent in Bhale Bhale Magadivoy movie. Mahesh Babu came as a chief guest for Krishna Gadi Veera Prema Gadha audio launch.