ఏడాదిలో నాని సంపాదన ఎంతో తెలుసా?

Nani earned 12 crores for 1 year

04:08 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Nani earned 12 crores for 1 year

సినీపరిశ్రమలో వరుసగా విజయాలు వస్తే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి! అలాగే డిమాండ్ పెరగడంతో హీరోలైనా, హీరోయిన్ లైనా, కమెడియన్ లైనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లైనా అమాంతం పారితోషికం కూడా పెంచేస్తారు! ప్రస్తుతం ఉన్న పోటీ పరిశ్రమలో టాలీవుడ్ హీరోలు ఒక్క హిట్ కోసం పరితపించిపోతున్నారు. అలాంటిది నాని ఏకంగా ఏడాది గ్యాప్ లో వరుసగా మూడు హిట్లు కొట్టాడు. భలేభలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మెన్.. ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టి.. స్టార్ రేంజ్ కి చేరువయ్యాడు. ఈ మూడు హిట్లతో నాని రేంజ్, మార్కెట్ కూడా బాగా పెరిగిపోయాయి.

స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతుంటే.. నాని మాత్రం ఒక్క ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. గతేడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది వరకూ.. భలేభలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మెన్ సినిమాలు విడుదల చేశాడు. ఈ మూడు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఒక్క ఏడాదికే నాని సంపాదించిన మొత్తం 12కోట్లు! స్టార్ హీరోలు కూడా సాధించలేనంతగా హిట్లు కొట్టి ఇప్పుడు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టేశాడు. మజ్ను సినిమా సెట్స్ పై ఉండగానే.. తాజాగా నేను లోకల్ అనే సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు. మొత్తానికి నాని స్టార్ డమ్ ఎంజాయ్ చెయ్యడంతో పాటు హిట్లు కూడా కొట్టాడు.

English summary

Nani earned 12 crores for 1 year