నాని 'జెంటిల్ మన్' టీజర్

Nani Gentle Man Teaser

10:59 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Nani Gentle Man Teaser

అష్టా చెమ్మా సినిమాతో హీరో గా నాని ని పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి నాని తో కలిసి చేస్తున్న సినిమా జెంటిల్ మెన్ . ఇంతకు ముందు శ్రీ రామనవమి పండుగ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ఈ చిత్ర యూనిట్ , తాజా గా ఈ సినిమా ఫస్ట్ టీజార్ ను విడుదల చేసారు . ఒక విన్నుత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . బాలకృష్ణ ఆదిత్య 369 , వంశానికొక్కడు వంటి సినిమాలను తెరకెక్కించిన శివలంక కృష్ణ ప్రసాద్ "శ్రీదేవి మూవీస్" బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు .

"నిన్ను అంత ఈజీగా చావనిస్తానా" అంటూ నాని చెబుతున్న డైలాగ్, యాక్సిడెంట్ నుంచి హీరోయిన్ తప్పించుకోవడం లాంటి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఉన్న ఈ ట్రైలర్ ను చూస్తే ఈ సినిమా ఒక సరికొత్త కథాంశంతో తెరకెక్కినట్లు అర్ధం అవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లలాగే, టీజర్ కూడా చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మరి నాని హీరోనా విలనా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగి తీరాల్సిందే . ఈ సినిమాలో నాని సరసన సురభి , నివేద థామస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు .

ఇవి కూడా చదవండి:ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి(వీడియో)

ఇవి కూడా చదవండి:చిరుకి కూడా ఆ హీరోయిన్ ఏ కావాలట!

ఇవి కూడా చదవండి:రోడ్డు పై లవర్స్ కొట్టుకోవడం చూసి జనం ఏం చేసారో చూడండి(వీడియో)

English summary

Natural Star Nani's next film was Gentleman and now the first teaser of this movie was released by the movie unit. Director Indraganti Mohan Krishna was directed this film. Indraganti mohan krishna and nani worked for the second time in their movie career. This movie was coming with a different story line.