అమెరికాలో దిమ్మతిరిగే 'జంటిల్ మెన్' వసూళ్లు

Nani Gentleman movie collections in America

11:41 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Nani Gentleman movie collections in America

చిన్న సినిమా అయితేనేం, ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన దాఖలాలు వున్నాయి. తాజాగా నాని, సురభి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో విడుదలైన ‘జెంటిల్ మన్ ’ చిత్రం కూడా అంతే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. మణిశర్మ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈసినిమా మాంచి టాక్ తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఇక అమెరికాలో మంచి వసూళ్లు రాబడుతోంది. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండో వారంలో స్ట్రాంగ్ వసూళ్లను రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రెండోవారం... శుక్రవారం(35,624 డాలర్లు), శనివారం(62,770 డాలర్లు), ఆదివారం(32,166 డాలర్లు) మొత్తం 772,968 డాలర్లు (రూ. 5.25 కోట్లు) వసూలు చేసినట్లు తరణ్ ట్వీట్ చేశారు. ఒక రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఇది కూడా చూడండి: వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

ఇది కూడా చూడండి: ఫేస్ బుక్ లో అపరిచితులతో చాటింగ్ చేస్తున్నారా..పారాహుషార్

ఇది కూడా చూడండి: వావి వరసలు లేని అత్యాచారాల అడ్డా ఆ దేశం

English summary

Nani Gentleman Movie has been registering mind blowing collections at the box office.