నాని రేటు పెంచేసాడు !

Nani increased his remuneration

10:11 AM ON 4th January, 2016 By Mirchi Vilas

Nani increased his remuneration

న్యాచురల్ యాక్టింగ్‌ తో ప్రేక్షకులని ఆకట్టుకున్న హీరో నాని. తన అసాధారణ నటనతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొంది టాప్ స్ధాయికి చేరుకున్న నటుడు నాని. అయితే సరైన హిట్స్ లేక సతమతమవుతున్న నాని 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం, భలేభలే మగాడివోయ్ చిత్రాలతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. మారుతి తెరక్కెకించిన భలే భలే మగాడివోయ్ చిత్రం నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పుటి వరకు 2 కోట్లు పారితోషికం తీసుకునే నాని ఈ చిత్రం విజయంతో 4 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. మార్కెట్‌లో నాని కి ఉన్న డిమాండ్‌ బట్టి నిర్మాతలు కూడా నానికి అంత పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

నాని ప్రస్తుతం 'అందాల రాక్షసి' ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో బాలయ్య వీరభిమానిగా నటిస్తున్నాడు.

English summary

Nani increased his remuneration.