'కృష్ణగాడి వీరప్రేమగాథ’

Nani Latest Movie Updates

10:57 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Nani Latest Movie Updates

నాని, మెహరీన్ జంటగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఫిబ్రవరి 12న విడుదలచేయడానికి నిర్ణయించారట . . 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందు తున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు గా వున్నారు. సంపత, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వి, హరీష్‌ ఉత్తమన్, బేబి నయన్, మాస్టర్‌ ప్రథమ్‌, బేబీ మోక్ష తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: యువరాజ్‌, ఫైట్స్‌: విజయ్‌, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్‌: వర్మ, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, పాటలు: కె.కె (కృష్ణకాంత్).

ఈ సినిమాకు ‘‘ఫస్ట్‌లుక్‌, థియేట్రికల్‌ ట్రైలర్లకు చాలా మంచి స్పందన వచ్చింద ని నిర్మాతలు అంటున్నారు. 'సూపర్ స్టార్ మహేష్ చేతుల మీద విడుదలైన పాటలు అన్నిచోట్లా వినిపిస్తున్నాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ మంచి సంగీతాన్నిచ్చారు. కృష్ణగా నాని, మహాలక్ష్మిగా మెహరీన్ నటన ఆకట్టుకుంటుంది. యువరాజ్‌ కెమెరా హైలైట్‌ అవుతుంది. ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేస్తాం’’ అని వివరించారు .

English summary

Hero Nani's upcoming film "Krishna Gadi Verra Premagaadha" movie to be released on this February 12th. This film trailer got good response and Nani,Brahmaji,SAmpath,Muralikrishna were acted in this movie