'మంగమ్మ మనవడిగా' నాని?

Nani new movie title is Mangamma Gaari Manavadu??

12:04 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Nani new movie title is Mangamma Gaari Manavadu??

ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్‌ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ హీరో నాని మరో విజయానికి శ్రీకారం చుట్టాడు. 'అందాల రాక్షసి' ఫేమ్‌ హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇందులో నాని బాలకృష్ణ కి వీరాభిమాని అయిన పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకే ఈ చిత్రానికి 'జైబాలయ్య' అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానకి బాలకృష్ణ కెరీర్‌లో సూపర్‌హిట్స్‌ లో నిలిచిపోయిన 'మంగమ్మగారి మనవడు' అనే టైటిల్‌ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

మంచి ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని మరోసారి లవర్‌ బాయ్‌గా మీ అందరినీ అలరించనున్నాడు. ఈ చిత్రానికి టైటిల్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

English summary

Nani new movie title want to put as BalaKrishna super hit film Mangamma Gaari Manavadu. Because in this movie Nani is BalaKrishna's big fan.