నాని కొత్త సినిమా లుక్‌ ఇదేనా ?

Nani To Work With Indraganti Mohan Krishna

01:22 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Nani To Work With Indraganti Mohan Krishna

భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీరప్రేమగాధ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో దూసుకుపోతున్న న్యాచురల్‌ స్టార్‌ నాని హ్యాట్రిక్‌ విజయం పై కూడా కన్నేశాడు. నాని మొదటి చిత్రం 'అష్టాచమ్మా' చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని తాజాగా ఒక సినిమా చేస్తున్నాడు. ఆదిత్య 369, వంశానికొక్కడు వంటి చిత్రాలు నిర్మించిన శివలంక కృష్ణ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన సురభి, నివేద థోమస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ 40 శాతం పూర్తయింది. అయితే ఈ రోజు నాని పుట్టినరోజు కావడంతో బర్త్‌డే స్పెషల్‌ గా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ని విడుదల చేశారు. ఇందులో నాని ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మీరు కూడా చూడండి.

English summary

Natural Actor Nani was enjoying the success of his latest super hit Krishna Gaadi Veera Prema Gaadha.After this Nani was going to act under the direction of his first movie director Indraganti Moahn Krishna.This movie first look was released by the movie Unit