క్రిస్మస్ కి 'నాన్నకు ప్రేమతో' ఆడియో!

Nannaku Prematho audio releasing on December 25th

12:17 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Nannaku Prematho audio releasing on December 25th

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రెండు సరికొత్త లుక్స్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం మహిస్తుండగా ఎన్టీఆర్‌ సరసన రకుల్ ప్రీత్సింగ్ కథనాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి చివరి షెడ్యూల్‌ డిసెంబర్‌ 1న స్పెయిన్‌ లో ప్రారంభించారు. డిసెంబర్‌ 20 వరకు ఈ చిత్రం షూటింగ్‌ స్పెయిన్‌లోనే జరుగుతుంది. దీనితో షూటింగ్‌ మొత్తం పూర్తియినట్లే. అయితే ఈ చిత్రాన్ని సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇంకా నెల రోజులు మాత్రమే ఉండడంతో 'నాన్నకు ప్రేమతో' ఆడియో విడుదలకు డేట్‌ ఫిక్స్ చేసింది సుకుమార్‌ టీమ్‌.

డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ రోజున ఆడియోని రిలీజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరిగిపోయిన పార్ట్కి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సుకుమార్‌ టీమ్‌ అన్నిపనుల్ని వేగవంతం చేసింది. ఇంకా ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేద్రప్రసాద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్‌ నిర్మిస్తుండగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary

Nannaku Prematho audio releasing on December 25th in Hyderabad. This movie is directing by Sukumar.