నాన్నకు ప్రేమతో డైలాగ్స్‌ లీక్‌

Nannaku Prematho dialogues leaked

07:52 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Nannaku Prematho dialogues leaked

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో... ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, మోషన్‌ పోస్టర్స్‌ చూసిన తరువాత సినమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాకు సంబంధించిన రెండు డైలాగ్స్‌ ఇంటర్‌నెట్‌లో ఇప్పటికే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మధ్య కొత్త సినిమాల పాటులు, ఫొటోలు రిలీజ్‌కు ముందుగానే లీక్‌ చేయడం, లేదా ఉద్దేశ్యపూర్వకంగానే ఇంటర్‌నెట్‌లో వ్యాపింపచేయడం షరా మామూలు విషయంగా అయ్యింది. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాలో డైలాగ్స్‌ కూడా లీక్‌ అయ్యాయి.

లీక్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే.

1) మా నాన్న ఎదుగుదలని నేర్పించాడు.. ఎదిగే వాళ్ళను లాగడం నేర్పించలేదు.

2) నాన్న గురించిన హిస్టరీ పుస్తకాల్లో దొరికేదు కాదు.. జనాల మధ్యలో వారి గుండెల్లో ఉంటుంది.

ఈ రెండు డైలాగ్స్‌ చూస్తే నాన్నకు ప్రేమతో అని ఎందుకు టైటిల్‌ పెట్టారో అర్ధమైపోతుంది. డిసెంబర్‌ 13న ఈ సినిమాకు ఆడియోను రిలీజ్‌ చేస్తున్నారు.

English summary

Nannaku Prematho dialogues leaked. Ntr and Sukumar new movie Nannaku Pramatho dialogues were leaked in the internet.