'నాన్నకు ప్రేమతో' డేట్‌ ఫిక్స్‌... బాబాయ్‌ రాడు!

Nannaku Prematho movie audio launch date fixed but Balakrishna is not a chief guest

03:48 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Nannaku Prematho movie audio launch date fixed but Balakrishna is not a chief guest

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిసున్న 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి క్రియేటీవ్‌ డైరక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన మొదటి సారి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని పాటలు డిసెంబర్‌ 27న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఆడియో వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధి గా వస్తున్నారన్న రూమర్లకి దాదాపుగా తెరపడి పోయినట్లే. ఆ ఆడియో విడుదల రోజున బాలయ్య డిక్టేటర్‌ సాంగ్‌ షూటింగ్‌లో ఉంటాడు. అంటే నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకకి బాలకృష్ణ ముఖ్య అతిధిగా రావడమనేది పుకార్లే అని తెలిసిపోయింది.

ఇంకా బాబాయ్-అబ్బాయిలను ఒకే వేదిక పై నందమూరి అభిమానులు చూడలేరని తేలిపోయింది. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక రోజు 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతి బరిలో ఉంటుందా లేదా అని అనౌస్స్‌ చేస్తారని సమాచారం.

English summary

Nannaku Prematho movie audio launch is on December 27th. But BalaKrishna is not a chief guest for this audio launch.