'నాన్నకు ప్రేమతో' బ్లాక్‌ బస్టర్‌: సెన్సార్‌ రివ్యూ!!

Nannaku Prematho movie block buster hit: Censor review

05:53 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Nannaku Prematho movie block buster hit: Censor review

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. క్రియేటీవ్‌ డైరెక్టర్ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మొదటిసారి నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ రప్పించుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు రివ్యూ ఇచ్చింది. సెన్సార్‌ బోర్డు అధికారి అయిన కియరా సాంథు (ఎడిటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా మ్యాగజైన్‌ అండ్‌ మెంబర్‌ ఆఫ్‌ దుబాయ్‌ సెన్సార్‌ బోర్డ్‌ ) ఈ చిత్రం పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. నాన్నకు ప్రేమతో మొదటి కాపీని నేను చూశాను, ఎన్టీఆర్‌ చాలా అద్భుతంగా నటించారు ఇది కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలుస్తుంది అని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేసింది.

జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలవబోతున్న ఈ చిత్రం పై ఎన్టీఆర్‌ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో కియరా సాంథు ఇలా ట్వీట్‌ చెయ్యడంతో ఎన్టీఆర్‌ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

Saw #NannakuPrematho First Copy! @tarak9999 Stylish & Rocking Movie ever. Sure Shot Blockbuster on the Way. pic.twitter.com/F3lxOlmQiB

— Kiaara Sandhu (@KiaaraSandhu) January 3, 2016

English summary

Nannaku Prematho movie block buster hit: Censor review