జపాన్ లో రికార్డు సృష్టిస్తున్న నాన్నకు ప్రేమతో

Nannaku Prematho movie creating records in Japan

03:16 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Nannaku Prematho movie creating records in Japan

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి విడుదల అయ్యి 50 కోట్ల మార్క్ ని అందుకుంది. తొలిసారిగా 50 కోట్ల మార్క్ అందుకున్న ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు డబుల్ అయ్యింది. ఆ క్రేజ్ పుణ్యమే 'నాన్నకు ప్రేమతో' సినిమా జపాన్ లో భారీగా విడుదల అవ్వడానికి దోహదపడింది. జపాన్ లో ఇంతకుముందు ఇండియా నుండి మరీ ముఖ్యంగా సౌత్ నుండి రజినీకాంత్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా అక్కడ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 'టెంపర్' హిట్ తో ఋజువు అయ్యింది.

ఆ క్రేజ్ వల్ల 'నాన్నకు ప్రేమతో' సినిమాను అక్కడ భారీగా విడుదల చేశారు. తెలుగు సినిమాలు అక్కడ విడుదల అవ్వడమే అరుదు అంటే అలాంటి సినిమాలకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం మరింత గొప్ప విషయం. కాగా 'నాన్నకు ప్రేమతో' విషయంలో అదే జరిగింది. సినిమా విడుదల అయిన ప్రతీచోట కనీసం 40% నుండి 45% సెంటర్ లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయట. దాంతో ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో మరోసారి ఋజువు చేయబోతుంది అంటున్నారు నాన్నకు ప్రేమతో.

English summary

Nannaku Prematho movie creating records in Japan. Young Tiger Ntr movie Nannaku Prematho creating records in Japan.