నాన్నకు ప్రేమతో మూవీ రివ్యూ

Nannaku Prematho Movie First Day Review And Rating

02:15 PM ON 13th January, 2016 By Mirchi Vilas

Nannaku Prematho Movie First Day Review And Rating

నాన్నకు ప్రేమతో రేటింగ్ : 3.5/5

యంగ్ టైగర్ ఎన్టీఅర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు . ఎన్టీఅర్ ఇప్పటి వరకు 24 సినిమాల్లో నటించి తన 25వ సినిమాగా నటించిన "నాన్నకు ప్రేమతో" చిత్రంలో ఎన్టీఆర్ ఒక సరి కొత్త లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక డిఫరెంట్ స్టొరీ తో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరక్కెకించాడు.ఈ సినిమాకు దేవి శ్రీ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది.సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి – కొడుకుల మధ్య అనుబంధాన్నిసుకుమార్ చక్కగా చూపించారు.

కథ :

మన హీరో అభిరామ్ (ఎన్.టి.ఆర్) ఒక లండన్ బేస్డ్ ఎన్ఆర్ఐ. తన తండ్రి రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) లండన్ లో ఉంటారు.అభిరామ్ తండ్రి కి ఆరోగ్యం బాలేదని తెలియగానే స్పెయిన్ నుండి వస్తాడు అభిరామ్ . ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజేంద్ర ప్రసాద్ ద్వారా తను ఆ పరిస్థితికి రావడానికి కారణమైన కృష్ణమూర్తి (జగపతిబాబు) గురించి తెలుసుకుంటాడు. అప్పుడు రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్ ) తన కుమారులని ఓ కోరిక కోరతాడు.

తన తండ్రి కోరికను నెరవేర్చడానికి తిరిగి లండన్ బయలుదేరుతాడు అభిరామ్. అక్కడ కృష్ణమూర్తి(జగపతి బాబు) గురించి తెలుసుకొని, తన కూతురు దివ్యాంక (రకుల్)ను ప్రేమలో పడేస్తాడు. దివ్యాంక ద్వారా ఎలా అభిరామ్ కృష్ణమూర్తికి దగ్గర అయ్యాడు. అలాగే కృష్ణమూర్తికి – అభిరామ్ కి మధ్య జరిగిన గొడవ ఏంటి.? . కృష్ణమూర్తి రమేష్ చంద్ర ప్రసాద్ కు చేసిన ద్రోహం ఏంటి ? తన తండ్రి కోరిన కోరికను అభిరామ్ ఎలా నేరవేర్చాడు అనేది తెర పై చూసి తెలుసుకోవల్సిందే

English summary

Nannaku Prematho Movie First Day Review And Rating,Live Updates