జపాన్‌లో నాన్నకు ప్రేమతో

Nannaku Prematho movie is releasing in Japan

12:35 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Nannaku Prematho movie is releasing in Japan

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే మొదటిసారి 50 కోట్లు మార్క్‌ దాటిన చిత్రం నాన్నకు ప్రేమతోనే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేయబోతున్నారు. జపాన్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కి మాత్రమే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్‌ కి కూడా అక్కడ ఫ్యాన్స్ పెరిగిపోయారు. తాజా సమాచారం ప్రకారం జపాన్‌లోని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అసోషియేషన్‌ మెంబర్స్‌ రిక్వెస్ట్‌ మేరకు ఈ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని జపాన్‌ సబ్‌ టైటిల్స్‌తో ఫిబ్రవరి 14న జపాన్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. అంతే కాదు ఈ చిత్రాన్ని జపాన్‌ భాషలోకి డబ్‌ చేయబోతున్నారు. ఆ వెర్షన్‌ని వేసవిలో దిల్‌ రాజు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ ఒక్క చిత్రం ఎన్టీఆర్‌ క్రేజ్‌ ని ఎలా మార్చేసిందో ఇది చూస్తే అర్ధమవుతుంది.

English summary

Young Tiger Ntr latest sensation Nannaku Prematho movie is releasing in Japan with Japanese sub titles on February 14th.