నాన్నకు ప్రేమతో రచయిత డైరెక్టర్ గా...

Nannaku Prematho movie writer turned as a director

03:48 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Nannaku Prematho movie writer turned as a director

త‌రుణ్ శెట్టి, అవంతిక మిశ్రా లని హీరోహీరోయిన్లు గా పరిచయం చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్న‌కు ప్రేమ‌తో' చిత్ర ర‌చయిత హుస్సైన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌కుడిగా మారి 'మీకు మీరే మాకు మేమే' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. క్లాసికల్ సూపర్ హిట్ మూవీ 'మిస్సమ్మ' లో ఒక పాటని లో మొదటి లైన్ ని టైటిల్ గా మార్చి ఈ చిత్రానికి పెట్టారు. దర్శకుడు మాట్లాడుతూ ఆల్ టైమ్ క్లాసికల్ సూపర్ హిట్ మూవీ 'మిస్స‌మ్మ' చిత్రం అంటే నాకు చాలా ఇష్టం ఆ చిత్రం లోని ఒక సన్నివేశానికి స్పూర్తి ని పొంది ఈ చిత్ర కధను మలిచాను అని తెలిపారు. ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకం పై ఈ చిత్రం నిర్మించబడింది.

ఈ చిత్రానికి శ్ర‌వ‌న్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ని త్వరలోనే విడుదల చేసి ఫిబ్రవరి లో 'మీకు మీరే మాకు మేమే' అనే చిత్రాన్ని విడుదల చేస్తాం. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని నమ్మకం వ్యకాతం చేశారు దర్శకుడు హుస్సైన్ షా కిరణ్.

English summary

Nannaku Prematho movie writer Hussain Sha Kiran turned as a director. He directed a movie called Meeku Meere Maaku Meme. Tarun Shetty and Avantika Mishra was introducing as a new pair in telugu with this film.