నాన్నకు పేమతో ప్రొడ్యూసర్ ఖుషీ

Nannaku Prematho producer Bvsn Prasad get jackpot

03:18 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Nannaku Prematho producer Bvsn Prasad get jackpot

అవును... అదృష్టం ఉంటే ఏదోలా కలసివస్తుంది. నష్టం భర్తీ అయిపోతుంది. అవును జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో తొలిసారి రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసి కూడా కొన్ని ఏరియాల్లో నష్టం చవిచూసిన నాన్నకు ప్రేమతో ప్రొడ్యూసర్ కి జాక్ పాట్ తగిలింది. దాదాపు రూ. 54 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా. అయినప్పటికీ ఈ సినిమాను హిట్ కేటగిరీలో వేయలేని పరిస్థితి. దాని బడ్జెట్ రూ.50 కోట్ల పైనే ఉండటమే అందుక్కారణం. బిజినెస్ రూ. 55 కోట్ల దాకా జరిగి, పెట్టుబడి.. వసూళ్లు రెండు దాదాపుగా ఈక్వల్ అయ్యాయి. కొన్ని ఏరియాల్లో నష్టం కూడా వచ్చింది. అందుకే దీన్ని ఎబోవ్ ఏవరేజ్ గా పరిగణించాల్సి వచ్చింది.

అయితే విడుదలైన ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఆ సినిమా హిట్ కేటగిరిలో చేర్చే పరిణామం జరిగింది. ఈ సినిమాకు నిర్మాత పెట్టిన పెట్టుబడిలో రూ. 8 కోట్లు వెనక్కి వచ్చాయి. అబ్బో ఇదేంటి అనుకుంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. యూరోప్ లోని చాలా దేశాల్లో సినిమా షూటింగుల్ని ప్రోత్సహించేందుకు.. అక్కడ షూటింగుకి అయిన ఖర్చులో కొంత వెనక్కి ఇచ్చే ఆఫర్ ఇస్తారట. యూకేలో సైతం ఇలాగే రిబేటు ఇస్తారు. నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ లండన్లోనే చేసిన నేపథ్యంలో, షూటింగ్ అయ్యాక ఖర్చు వివరాలు బ్రిటన్ ప్రభుత్వానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ అప్పగించాడు.

ఆ వివరాల్ని వెరిఫై చేసి.. షూటింగుకి అయ్యిన మొత్తంగా వెనక్కివ్వాల్సిన మొత్తం లెక్కించగా అది రూ. 8 కోట్లని లెక్కతేలింది. ఆ మొత్తాన్ని ఇటీవలే ప్రసాద్ కు చెల్లించారట. దీంతో ఈ మొత్తాన్ని ఆయన లాభంగానే భావించాలి. శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుంటే ప్రసాద్ కు బానే కల్సి వచ్చిందని చెప్పవచ్చు. అందుకే ఈ మధ్య తెలుగు సినిమాలు చాలా వరకు ఫారిన్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంతకుముందు పాటల కోసం మాత్రమే విదేశాలకు వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు మొత్తం సినిమాయే తీసేస్తున్నారు. అదండీ సంగతి.

English summary

Nannaku Prematho producer Bvsn Prasad get jackpot