'నాన్నకు ప్రేమతో'ని కన్ఫర్మ్ చేసిన రకుల్‌!!

Nannaku Prematho release confirmed by Rakul Preeth Singh

11:38 AM ON 17th December, 2015 By Mirchi Vilas

Nannaku Prematho release confirmed by Rakul Preeth Singh

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25 వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్ సింగ్ కధానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే దేవీశ్రీప్రసాద్‌ తండ్రి సత్యమూర్తి చనిపోవడంతో నాన్నకు ప్రేమతో చిత్రం సంక్రాంతి బరి నుండి తప్పుకుంది అని నిన్న వార్తలొచ్చాయి. అయితే రిలీజ్‌ తేదీని స్పష్టం చేస్తూ ఈ చిత్రం కధానాయిక రకుల్‌ ప్రీత్ సింగ్ నిన్న తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేసింది. ఎట్టి పరిస్థితిలోనూ జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీ-రికార్డింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పనులు దేవీశ్రీ త్వరలోనే పూర్తి చేస్తారు. ఎలా అయినా సంక్రాంతి బరిలోకి 'నాన్నకు ప్రేమతో' ని దించాలని సుకుమార్‌ గారి ప్లాన్‌ అని రకుల్‌ తెలియజేసింది.

English summary

Nannaku Prematho release confirmed by Rakul Preeth Singh with her Twitter account.