సంక్రాంతికి 'నాన్నకు ప్రేమతో' కన్ఫర్మ్!

Nannaku Prematho release confirmed on Sankranthi

06:35 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Nannaku Prematho release confirmed on Sankranthi

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25 వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని కొన్ని కారణాలు వల్ల సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యడం లేదని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ వార్తలని కొట్టి పారేస్తూ ఈ చిత్ర నిర్మాతలైన బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నాన్నకు ప్రేమతో సంక్రాంతికి రిలీజ్ అనే పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో యంగ్‌టైగర్‌ చాలా స్టైలిష్‌గా జీప్‌ మీద కూర్చిని ఉన్నాడు. మీరు కూడా ఒక లుక్‌ వెయ్యండి.


English summary

Nannaku Prematho release confirmed on Sankranthi. Nannaku Prematho new poster released today by producers and revealed that movie is releasing on Sankranthi.