స్పెయిన్‌లో దొరికేసిన 'నాన్నకు ప్రేమతో టీమ్‌'

Nannaku Prematho team caught in Spain

01:51 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Nannaku Prematho team caught in Spain

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎన్టీఆర్‌ సరసన నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో ఓ మేజర్‌ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల్ని స్పెయిన్‌లో చిత్రీకరించబోతున్నారు. ఆ షూటింగ్‌ కోసం సుకుమార్‌ అండ్‌ టీం స్పెయిన్‌ ఇప్పటికే చెక్కేశారు. ఎన్టీఆర్‌ కూడా బయలుదేరి వెళ్లారు. ఈ రోజు నుండి అక్కడ రెగ్యులర్‌గా షూటింగ్‌ చేయనున్నారు.

ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తయినట్లే. డిసెంబర్‌ చివరి వారంలో ఈ చిత్రం ఆడియోను, సంక్రాంతికి సినిమాని విడుదల చేయబోతున్న ఈ చిత్రాన్ని బివిఎన్‌ఎస్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

English summary

Ntr Nannaku Prematho team is now in Spain. They went to shoot major schedule for the movie. Sukumar is directing the movie with high expectations.