బాలకృష్ణ 'నన్ను వదిలి నీవు పోలేవులే'

Nannu Vadili Neevu Polevule Audio Launch

12:24 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Nannu Vadili Neevu Polevule Audio Launch

ఇంతకీ ఈ చిత్రంలో హీరో బాలకృష్ణ అంటే నందమూరి నట సింహం బాలయ్య అనుకుంటున్నారా? కాదు కాదు ... ఇతను కూడా బాలకృష్ణ పేరు పెట్టుకున్న వర్ధమాన హీరో . అలా పేరు పెట్టుకున్నది మాత్రం, బాలయ్య మీద వీరాభిమానంతో ఈ పేరు పెట్టుకున్నాడు. బాలకృష్ణ కోలా, వామిక జంటగా నటించగా, ప్రముఖ దర్శకుడు శ్రీరాఘవ అందించిన కథతో ఆయన భార్య గీతాంజలి శ్రీరాఘవ తెరకెక్కించిన ‘నన్ను వదిలి నీవు పోలేవులే’చిత్రాన్ని కోలా భాస్కర్‌, కంచర్ల పార్థసారథి నిర్మించారు. అమృత్‌ స్వరపరిచిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

తొలి సీడీని కథానాయిక వేద ఆవిష్కరించగా, వామిక స్వీకరించారు. నిర్మాతల్లో ఒకరైన కోలా భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘మా అబ్బాయి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో తనకి క్రిష్‌ అనే పేరు పెడదామనుకొన్నాం. కానీ శ్రీరాఘవగారికి ఆ పేరు నచ్చలేదు. మా అబ్బాయి కథానాయకుడు బాలకృష్ణగారికి పెద్ద అభిమాని. అందుకే కోలా బాలకృష్ణ అనే పేరుని నిర్ణయించాం. సినిమాయే లోకంగా బతికే దర్శకుడు శ్రీరాఘవ. ఆయన నా స్నేహానికి ఇచ్చిన విలువే ఈ చిత్రం. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘తమిళంలో ఘన విజయం సాధించిందీ చిత్రం , తెలుగులోనూ అదే ఫలితం పునరావృతం అవుతుంది.’’అంటున్నాడు.అమృత్‌,. సీవీ రెడ్డి, బెక్కెం వేణుగోపాల్‌, ఏసీపీ కాళేశ్వరరావు, అమర్‌నాథ్‌, అనంత్‌ శ్రీరామ్‌, పూనమ్‌ కౌర్‌, జ్యోతి, బి.ఎ.రాజు, కృష్ణతేజ, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

English summary

Kola Balakrishna's latest movie "Nannu Vadili Neevu polevule" audio was launched at Hyderabad.This movie was dubbed from Tamil. This movie was directed by Geetanjali Selva Raghavan.