ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 నెలలు వచ్చే బ్యాటరీ

Nanowire Battery Could Lasts For Three Months

12:23 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Nanowire Battery Could Lasts For Three Months

ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది . నిజం చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లు ప్రజల జీవితాల్లో ఒక భాగం అయిపోయాయి . స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఎదుర్కొనే ప్రధాన సమస్య ఛార్జింగ్ . స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఇంటర్నెట్ వాడినా , గేమ్స్ ఆడినా ఛార్జింగ్ ఇట్టె అయిపోతుంటుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ కోసం చాలా మంది పవర్ బ్యాంక్ లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సమస్యకు శాస్త్రవేత్తలు ఒక చక్కటి ఉపాయాన్ని కనిపెట్టారు. మనం ఎంత ఎక్కువగా ఉపయోగించినా ఛార్జింగ్ ఏమాత్రం తగ్గిపోని ఒక బ్యాటరీ ను యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మనిషి వెంట్రుకలకన్నా పలుచగా ఉండే నానో వైర్లను ఈ బ్యాటరీ లో ఉపయోగించారట . బ్యాటరీ లోని శక్తిని ఎప్పుడు నిలిచి ఉండేలా గోల్డ్ నానో వైర్లు ఉపయోగాపడతాయని శాస్త్రవేత్తలు చేబుతున్నారు . ఈ అత్యాధునిక బ్యాటరి ని తొందరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:స్మార్ట్‌ఫోన్లను అలాంటి చోట్ల పెట్టుకుంటే ఇక రోగాలే?

ఇవి కూడా చదవండి:వాట్సాప్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్

English summary

University of California Scientists invented a new battery which lasts three months when fully charged once. This battery was made with Gold Nano Wires. Scientists said that they were going to bring this battery to users very soon.